News February 5, 2025

పందలపాక హత్య కేసులో నిందితుడి తల్లి అరెస్ట్

image

బిక్కవోలు మండలం పందలపాకలో గత నెల 29న హత్యకు గురైన లలితేశ్వరి కేసులో నిందితుడు తల్లి గుంతికోలు వరలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో ఆమె పాత్ర ఉన్నట్లుగా విచారణలో తేలడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనపర్తి సీఐ సుమంత్ తెలిపారు. వరలక్ష్మి కుమారుడు దుర్గాప్రసాద్ లలితేశ్వరిని కేబుల్ వైర్ మెడకు బిగించి చంపిన సంగతి విదితమే. ఈ హత్యలో మరికొందరి పాత్ర ఉందని గ్రామ మహిళలు ఇటీవల ఆందోళన చేశారు.

Similar News

News November 10, 2025

రాజమండ్రి: ‘ఇప్పుడు ఇంటి పన్ను కట్టడం నిమిషాల్లో పని’

image

జిల్లా ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం రూపొందించిన ‘స్వర్ణ పంచాయతీ’ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఇంటి పన్నులు చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ‘ఇంటి పన్ను చెల్లింపుల అవగాహన పోస్టర్’ ఆవిష్కరణ జరిగింది. ఈ కొత్త విధానం ద్వారా కేవలం ఫోన్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇంటి పన్నులు సులభంగా చెల్లించవచ్చునన్నారు.

News November 10, 2025

రాజమండ్రి: ఈ తేదీల్లో లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్

image

లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్‌ను నవంబర్ 17 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. మైక్రోబాక్టీరియా లెప్రీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే చర్మవ్యాధి పూర్తిగా నయం అవుతుందన్నారు. చర్మంపై స్మర్శలేని మచ్చలు, బొడిపెలు, నరాల సమస్యలు గల వారు సమీపంలోని PHC, CHCలను వెంటనే సంప్రదించాలని సూచించారు. చికిత్స, మందులు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితమని కలెక్టర్ తెలిపారు.

News November 9, 2025

సబ్సిడీ వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం: ఈడీ

image

తూ.గో జిల్లాలోని సఫాయి కర్మచారి నిరుద్యోగ యువతకు NSKFDC పథకంలో భాగంగా సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు మంజూరు చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి తెలిపారు. అర్హులైన వారు కాకినాడలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు 62818-17023 నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు.