News February 5, 2025
పందలపాక హత్య కేసులో నిందితుడి తల్లి అరెస్ట్

బిక్కవోలు మండలం పందలపాకలో గత నెల 29న హత్యకు గురైన లలితేశ్వరి కేసులో నిందితుడు తల్లి గుంతికోలు వరలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో ఆమె పాత్ర ఉన్నట్లుగా విచారణలో తేలడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనపర్తి సీఐ సుమంత్ తెలిపారు. వరలక్ష్మి కుమారుడు దుర్గాప్రసాద్ లలితేశ్వరిని కేబుల్ వైర్ మెడకు బిగించి చంపిన సంగతి విదితమే. ఈ హత్యలో మరికొందరి పాత్ర ఉందని గ్రామ మహిళలు ఇటీవల ఆందోళన చేశారు.
Similar News
News February 12, 2025
తూ.గో: చికెన్, గుడ్ల సరఫరా నిలిపివేత

కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో తూ.గో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ హాస్టల్స్‌లో గుడ్లు, చికెన్ సరఫరాను నిలిపివేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి శోభారాణి తెలిపారు. గుడ్లకు బదులుగా బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు, ఆదివారం మటన్ కర్రీ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని వార్డెన్లకు సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని స్కూళ్లలో గుడ్ల సరఫరా నిలిపివేశారు.
News February 12, 2025
తూ.గో: వండిన చికెన్‌నే తినాలి

తూ.గో జిల్లా పెరవలి మండలంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వండిన చికెన్ మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. 75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకూ ఉడకపెట్టాలన్నారు. చికెన్, గుడ్లు చేతితో తాకితే శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఎవరికైనా జ్వరం, తలపోటు, జలుబు లక్షణాలు వస్తే వైద్య సిబ్బందికి సమాచారం అందిచాలన్నారు.
News February 12, 2025
కొవ్వూరు: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

వాడపల్లికి చెందిన చిట్రా సూర్య(20) మంగళవారం ఇంట్లో ఉరేసుకుని బలవర్మణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. రాజమండ్రిలో ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న అతడికి ఓ బాలికతో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన ఆమెను కలిసేందుకు వెళ్లాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అతడిని బెదిరించి దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.