News January 30, 2025

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్ 

image

జిల్లాలో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియేట్ థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 55 పరీక్షా కేంద్రాల్లో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షలకు 33,511 మంది విద్యార్ధులు హాజరుకానున్నట్లు చెప్పారు.

Similar News

News November 11, 2025

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు: కలెక్టర్ తేజస్

image

సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసి, మిల్లులకు పంపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం ఆయన తిరుమలగిరి మండలం తొండ, కోక్యా నాయక్ తండా, ఫణిగిరిలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యత కలిగిన ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం వహించవద్దని సూచించారు.

News November 11, 2025

ఏలూరు: ఈ కోర్సులో చేరేందుకు మెరిట్ లిస్ట్ విడుదల

image

ఏలూరు: హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సులలో ప్రవేశానికి 2వ ఫేజ్ కౌన్సిలింగ్‌కు మెరిట్ లిస్ట్‌ను గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నోటీసు బోర్డులో పొందుపరిచారు. ఈ విషయాన్ని ది వైద్య కళాశాల ప్రిన్సిపల్ సావిత్రి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 12న ఉదయం 10 గంటలకు కాలేజీ‌లో వెరిఫికేషన్‌కు మెరిట్ లిస్టు‌లోని అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు.

News November 11, 2025

విశాఖ కలెక్టరేట్‌లో మైనారిటీ వెల్ఫేర్ డే

image

అబుల్ కలాం జయంతి పురస్కరించుకొని విశాఖ కలెక్టరేట్ లో జాతీయ విద్యా దినోత్సవం,మైనారిటీ వెల్ఫేర్ డే వేడుకలు మంగళవారం నిర్వహించారు.కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అబుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ ఆనందపురంలో పీకేరు గ్రామంలో నాలుగు ఎకరాల భూమిలో ముస్లింలకు బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మైనారిటీ సొసైటీ భూములు 22ఏ నుంచి విడిపించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.