News January 31, 2025
పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు: భద్రాద్రి కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహించొద్దన్నారు.
Similar News
News January 9, 2026
HNK: టెన్త్ విద్యార్థులకు అల్పాహార నిధులు విడుదల!

పదో తరగతి ప్రత్యేక తరగతులకు హాజరయ్యే ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర సమగ్రశిక్ష విభాగం అల్పాహార నిధులు మంజూరు చేసింది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున, ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు (19 రోజులకు) ఈ అల్పాహార ఖర్చులు మంజూరు చేశారు. దీంతో వరంగల్‌లో 2,768 మందికి రూ.7.88 లక్షలు,
హనుమకొండలో 2,491 మందికి రూ.7.09 లక్షల నిధులు మంజూరయ్యాయి.
News January 9, 2026
‘భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

TG: ‘భూ భారతి’ పోర్టల్ ద్వారా కొందరు మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో కొంత ప్రభుత్వానికి జమ చేసి మిగతా నగదును పర్సనల్ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తేల్చారు. జనగామలో ఒక్కరోజే ₹8L తేడాను గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అవకతవకలు జరిగాయేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
News January 9, 2026
నరసరావుపేటలో ఐపీ కలకలం.. ప్రముఖ వాహన డీలర్ దివాలా!

నరసరావుపేటలో ప్రముఖ ద్విచక్ర వాహన డీలర్ ఎర్రంశెట్టి సోదరులు దివాలా పిటిషన్ దాఖలు చేయడం స్థానికంగా కలకలం రేపింది. రూ.60 కోట్ల మేర బకాయిలు చెల్లించలేక, వ్యాపార నష్టాల సాకుతో వీరు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘకాలంగా నమ్మకమైన వ్యాపారులుగా పేరున్న వీరు ఒక్కసారిగా IP నోటీసులు పంపడంతో బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. భారీ మొత్తంలో డబ్బులిచ్చిన వారు తమ పెట్టుబడి ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


