News February 11, 2025
పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికలు : ASF కలెక్టర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అదికారులను ఆదేశించారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శాసనమండలి ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు.
Similar News
News December 10, 2025
విజయవాడ: చిన్నారులకు కిడ్స్ ట్రాకింగ్ బ్యాండ్లు

భవానీ దీక్షల విరమణ కార్యక్రమం కోసం భక్తుల భద్రత నిమిత్తం 4వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా కిడ్స్ ట్రాకింగ్ రిస్ట్ బ్యాండ్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 270 సీసీ కెమెరాలకు అదనంగా 50 కెమెరాలను జోడించి, మొత్తం 320 సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రతను పటిష్ఠం చేశారు.
News December 10, 2025
6 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు నేపథ్యంలో ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్ రాజర్షి షా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రచారం ముగిసిన వెంటనే 6 మండలాల్లోని మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూసివేయాలని సూచించారు.
News December 10, 2025
సిరిసిల్ల: ఓటు చోరీకి మద్దతుగా 27వేల సంతకాల సేకరణ

టీపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు ఓటు చోరీ కార్యక్రమానికి మద్దతుగా జిల్లాలో 27 వేల సంతకాలను సేకరించినట్లు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరిగిందని నిరూపిస్తూ సేకరించిన సంతకాలను గాంధీభవన్లో అప్పగించామని పేర్కొన్నారు. ఓట్ చోరీ జరిగిన విషయం రాష్ట్రపతి వరకు చేరవేసేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన కార్యక్రమానికి జిల్లా ప్రజలు మద్దతు తెలిపారని ఆయన వెల్లడించారు.


