News March 2, 2025
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు: ఏలూరు కలెక్టర్

ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన చేసుకుని పారదర్శకతతో లెక్కింపు చేయాలని MLC ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు. సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సిబ్బంది 3వ తేదీ ఉ.6 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు. ఉ.8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కాగా ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Similar News
News December 22, 2025
కోనసీమ SP కార్యాలయానికి 29 అర్జీలు

కోనసీమ జిల్లా SP కార్యాలయానికి ప్రజల నుంచి 29 అర్జీలు వచ్చినట్లు కార్యాలయం ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. ప్రజల నుంచి కేసుల వివరాలను SP స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు అర్జీల రూపంలో వచ్చినట్లు వెల్లడించారు.
News December 22, 2025
లోక్ అదాలత్‌లో 3,884 కేసుల పరిష్కారం: సూర్యాపేట ఎస్పీ

జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 3,884 కేసులు పరిష్కారమైనట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఇందులో 446 క్రిమినల్, 1,582 ఈ-పెట్టీ, 1,856 ఎంవీ యాక్ట్ కేసులు ఉన్నాయి. అలాగే 33 సైబర్ కేసుల్లో రూ.11.50 లక్షలను బాధితులకు రీఫండ్ చేయించారు. పోలీస్, న్యాయశాఖల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని, ముందస్తు ప్రణాళికతో పెండింగ్ కేసులను తగ్గించగలిగామని ఎస్పీ పేర్కొన్నారు.
News December 22, 2025
ఫిర్యాదులపై సత్వర చర్యలు: సూర్యాపేట ఎస్పీ

బాధితులకు అండగా ఉంటూ ప్రజా సమస్యలను చట్టపరిధిలో వేగంగా పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ కె.నరసింహ భరోసా ఇచ్చారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.


