News August 17, 2024

పకడ్బందీగా డ్రైనేజీ వ్యవస్థకు జలమండలి రూపకల్పన

image

అవుటర్ రింగ్ రోడ్డు లోపల మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పక్కా మురుగు నీటి వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ప్రణాళికకు జలమండలి రూపకల్పన చేస్తోంది. పకడ్బందీగా డ్రైనేజీ వ్యవస్థను తీర్చిదిద్దాలని యోచిస్తోంది. దాదాపు 4,600 కి.మీ మేరకు డ్రైనేజీ వ్యవస్థ అవసరమని జలమండలి గుర్తించింది. త్వరలో అవుటర్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ అమృత్ స్కీం, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో 32 మురుగు శుద్ధి కేంద్రాలు నిర్మించనుంది.

Similar News

News September 17, 2024

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలన వేడుకలు

image

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.

News September 17, 2024

బాలాపూర్ లడ్డూ.. 30 ఏళ్లలో ఆమె ఒక్కరే..!

image

HYD బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ప్రతీ సంవత్సరం ఎంతో ఉత్కంఠ నడుమ కొనసాగుతుంది. అయితే ప్రతిసారి ఇందులో పురుషులే పాల్గొంటూ ఉంటారు. కానీ 2009లో మాత్రం సరిత అనే మహిళ వేలంలో పాల్గొని రూ.5,10,000కు లడ్డూ కైవసం చేసుకుని సత్తా చాటారు. 1994 నుంచి 2024 వరకు 30 ఏళ్లలో బాలాపూర్ లడ్డూ కొన్న ఒకే ఒక్క మహిళగా సరిత నిలిచారు. ఈసారి రూ.30,01,000కు కొలన్ శంకర్ రెడ్డి లడ్డూ దక్కించుకున్న విషయం తెలిసిందే.

News September 17, 2024

బస్‌ భవన్‌లో ప్ర‌జా పాల‌న దినోత్స‌వ వేడుకలు

image

హైదరాబాద్ బస్‌ భవన్‌లో మంగ‌ళ‌వారం ‘తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వం’ ఘ‌నంగా జ‌రిగింది. TGSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్(ఆప‌రేష‌న్స్) మునిశేఖ‌ర్ జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేసి జెండా వంద‌నం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ ర‌వింద‌ర్, జాయింట్ డైరెక్ట‌ర్ అపూర్వ‌రావు, ఫైనాన్స్ అడ్వ‌జ‌ర్ విజ‌య‌పుష్ఫ‌, హెచ్‌వోడీలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.