News April 11, 2025

పకడ్బందీగా పక్వాడ కార్యక్రమాలు: BPL కలెక్టర్

image

నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో పోషణ పక్వాడ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు చేపట్టనున్న కార్యక్రమాలు పోషణ పక్వాడ కార్యక్రమాల షెడ్యూల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

Similar News

News November 18, 2025

X(ట్విటర్) డౌన్

image

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT

News November 18, 2025

GWL: మాదక ద్రవ్యాలతో మనుగడకు ముప్పు-DMHO

image

మాదక ద్రవ్యాలతో మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని గద్వాల జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్మయి పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయంలో వైద్య సిబ్బందికి మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం చట్టరీత్యా నేరమన్నారు. మద్యం మత్తు జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. ఎక్కడైనా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News November 18, 2025

అల్లూరి: ‘భూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి’

image

రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాడేరు కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, ఆర్వోఎఫ్ఆర్, మ్యుటేషన్‌కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ పోర్టల్ నందు ఆధార్ నంబర్లను సరిచేసి వెంటనే అనుమతి కోసం మండల వ్యవసాయ అధికారుల లాగిన్‌కు పంపించాలన్నారు.