News March 6, 2025

పకడ్బందీగా పది పరీక్షలు: భద్రాద్రి కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేశ్‌ వి పాటిల్ హాజరై పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు. జిల్లాలో 73 పరీక్షా కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 12282 మంది, ప్రైవేట్ విద్యార్థులు 686 మంది హాజరవ్వనున్నారు.

Similar News

News November 25, 2025

ఇక పోలీసుల గుప్పిట్లో కర్రె గుట్టలు..!

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ను వేరు చేస్తూ ఇప్పటి వరకు మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న కర్రెగుట్టలు పోలీసులకు అడ్డాగా మారనున్నాయి. ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టు పార్టీ మనుగడ సాగించలేని పరిస్థితికి చేరుకుంది. రెండు రాష్ట్రాల పోలీసులు ఇప్పటికే కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తాజాగా ఏర్పాటైన బేస్ క్యాంపుతో ఒకప్పటి మావోయిస్టుల స్థావరం పోలీసుల వశమైంది. త్వరలో గుట్టపైన క్యాంపులు ఏర్పాటు కానున్నాయి.

News November 25, 2025

ICAR-IIMRలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

HYDలోని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌లో 5 సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc(జెనిటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, లైఫ్ సైన్స్, ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ ), PhD, PG( అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణతతో పాటు NET అర్హత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://www.millets.res.in/

News November 25, 2025

WGL: నిన్నటి లాగే స్థిరంగా పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర స్థిరంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా మంగళవారం సైతం అదే ధర పలికింది. రెండు వారాల క్రితం రూ.7 వేలు మార్కు దాటిన పత్తి ధర క్రమంగా తగ్గుతుండడంతో అన్నదాతలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.