News February 11, 2025
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు: డీఆర్‌వో

మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని శ్రీ సత్యసాయి జిల్లా డీఆర్‌వో విజయసారథి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్పతో కలిసి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షలకు ఈ ఏడాది 23,730 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. 449 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Similar News
News February 23, 2026
NGKL: నేడు రాష్ట్రవ్యాప్త కొవ్వొత్తుల ర్యాలీకి తీన్మార్ మల్లన్న పిలుపు

కుమ్మర మల్లన్న జాతరలో కాంగ్రెస్ నాయకుల దాడిలో బీసీ చిన్నారి మరణించిన ఘటనను నిరసిస్తూ, సోమవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని టీఆర్‌పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ప్రభుత్వ అరాచకాలను, పోలీసుల పక్షపాత వైఖరిని నిరసిస్తూ గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ఈ ర్యాలీలు చేపట్టాలని ఆయన కోరారు.
News February 23, 2026
పాక్ వైమానిక దాడులపై భారత్ ఫైర్

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దారుణమని విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది. తన దేశంలోని అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేసింది.
News February 23, 2026
నందిగాం: కళ్లల్లో కారం కొట్టి.. బంగారంతో పరార్

నందిగాం(M) నర్సాపురం గ్రామానికి చెందిన నెయ్యిల మహాలక్ష్మి మెడలో ఆదివారం బంగారం చైన్, పుస్తెలతాడు చోరీ జరిగింది. స్నానం కోసం గ్రామం శివారు చెరువుకు వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి అడ్డగించి కళ్లల్లో కారం కొట్టి మెడలో పుస్తెలతాడు, చైన్ తెంపుకెళ్లిపోయారని బాధితురాలు తెలిపింది. ఆమె భర్త పార్వతీశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


