News February 11, 2025

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు: డీఆర్‌వో

image

మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని శ్రీ సత్యసాయి జిల్లా డీఆర్‌వో విజయసారథి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్పతో కలిసి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షలకు ఈ ఏడాది 23,730 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. 449 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Similar News

News March 26, 2025

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల క్యూలైన్ ఎంబీసీ వరకూ ఉంది. ఇక శ్రీవారిని నిన్న 64,252మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 25,943మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.68 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు.

News March 26, 2025

HYD: అమ్మానాన్న సారీ.. స్టేటస్ పెట్టి SUICIDE

image

మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో సోమేశ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోదరి వివాహం కోసం దాచిన డబ్బులతో పాటు సోమవారం జరిగిన IPLలో ఒక్కరోజే లక్ష పోగొట్టుకున్నాడు. దీంతో అతడు.. ‘నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడయ్యా. డబ్బుల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు. నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మానాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సారీ’ అని స్టేటస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 26, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అన్నమయ్య ఎస్పీ

image

UPI మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. యు.పి.ఐ వ్యవస్థను ఉపయోగించి వినియోగదారుల బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్మును మాయం చేయడం సైబర్ నేరగాళ్ల పని అని తెలిపారు.

error: Content is protected !!