News February 10, 2025

పకడ్బందీగా పరీక్షల నిర్వహణ: డిఐఈఓ

image

సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల కమిటీ కన్వీనర్ కే రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఈనెల 3 నుంచి 22 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు.

Similar News

News October 28, 2025

ప్రారంభమైన వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లు: కలెక్టర్

image

వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలను HNK జిల్లాలో ప్రారంభమైనట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. పంటల ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాలలో గన్నీ సంచులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమ మీటర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా 7330751364ను సంప్రదించాలని సూచించారు.

News October 28, 2025

అక్టోబర్ 28: చరిత్రలో ఈరోజు

image

1867: స్వామి వివేకానంద బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ సిస్టర్ నివేదిత జననం
1909: రచయిత కొడవటిగంటి కుటుంబరావు జననం
1924: నటి సూర్యకాంతం జననం (ఫొటోలో)
1959: సినీ నటుడు గోవిందరాజు సుబ్బారావు మరణం
☛ అంతర్జాతీయ యానిమేషన్ డే

News October 28, 2025

ముచ్చటగా మూడు షాపులు దక్కించుకున్న మహిళ

image

మహబూబాబాద్ జిల్లాలోని ఓ మహిళను అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో ముచ్చటగా మూడు వైన్ షాపులను దక్కించుకుంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన ఎన్.శ్రీవాణికి డోర్నకల్ పట్టణంలో గౌడ కేటగిరీలో రెండు షాపులు రాగా.. ముల్కలపల్లిలో సైతం ఓ షాప్ వచ్చింది. దీంతో వారి ఆనందానికి హద్దులు లేవు. మీకు తెలిసిన వారికి లక్కీ డ్రాలో షాప్‌లు వస్తే కామెంట్లో తెలపండి.