News July 23, 2024
పకడ్బందీగా లబ్ధిదారుల ఎంపిక: పెద్దపల్లి కలెక్టర్

ప్రభుత్వం మహిళాశక్తి కింద చేపట్టిన వివిధ కార్యక్రమాలకు లబ్ధిదారులను పకడ్బందీగా ఎంపిక చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఎలిగేడు మండలం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. మహిళా శక్తి కార్యక్రమం, స్వశక్తి మహిళా సంఘాల రుణాలు వంటి పలు అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News February 25, 2026
KNR: ‘విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలి’

వచ్చే నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆకాంక్షించారు. కొత్తపల్లి మండలం చింతకుంట జడ్పీ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల నమూనా పరీక్ష పత్రాలను పరిశీలించి, వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలన్నారు.
News February 25, 2026
‘కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదు’

కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.