News March 17, 2025
పకడ్బంధీగా పదోతరగతి పరీక్షలను నిర్వహించాలి: కలెక్టర్

పకడ్బంధీగా పదోతరగతి పరీక్షలను నిర్వహించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. సోమవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో, పలు పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ముందుగా కంటోన్మెంటులో సెయింట్ ఆన్స్ బాలికోన్నత పాఠశాలను, మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. తరగతి గదులను పరిశీలించారు.
Similar News
News March 18, 2025
విజయనగరం: మహిళలు శక్తి యాప్ను తప్పనిసరిగా వాడాలి

రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం ఏర్పాటుచేసిన శక్తి యాప్ ప్రతి ఒక్క మహిళలు తమ ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..శక్తి యాప్ మహిళల నివాసం, కార్యాలయం, ప్రయాణంలో రక్షణ కల్పించేలా రూపొందించింది పడిందని, ఈ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలకు భద్రత కొత్తదారులు తెరుచుకున్నాయని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
News March 18, 2025
VZM: వినతులను పరిష్కరించి తెలుగులోనే సమాచారం ఇవ్వాలి

ప్రజా వినతుల పరిష్కార వేదికలో వివిధ వర్గాలు ఇచ్చే వినతులను పరిష్కరించిన అనంతరం తెలుగులో వారికి అర్ధమయ్యే రీతిలో సమాచారం ఇవ్వాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆయా డివిజన్ల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చిన ప్రతి వినతిని పరిష్కరించిన తర్వాత ఆయా వినతులు అందించిన వారితో మాట్లాడి వారు ఇచ్చిన వినతులను పరిష్కరించాలన్నారు.
News March 18, 2025
VZM: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా తమ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 283 మంది మందుబాబులపై కేసులు నమోదు చేసారన్నారు. వాహన తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ఈ-చలానాలను విధించారని తెలిపారు. ఇకనైనా పద్ధతులను మార్చుకొవాలన్నారు.