News June 21, 2024

పక్కపక్కనే కూర్చున్న అయ్యన్న.. రఘురామ

image

అసెంబ్లీలో నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పక్కపక్కనే కూర్చున్నారు. అయ్యన్నకు స్పీకర్ పదవి ఖరారవ్వగా.. ఆ పదవికి రఘురామ పేరు కూడా వినబడేది. కాగా.. వైసీపీపై వీరిద్దరూ తమదైన శైలీలో ఆరోపణలు చేసేవారు. ఈరోజు అసెంబ్లీలో పక్కపక్కనే కూర్చున్న వీరిద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.

Similar News

News September 20, 2024

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం రమేశ్

image

తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఈ సంఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

News September 20, 2024

విశాఖ: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘మోకా’కు చోటు

image

మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్ కుమార్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. విశాఖకు చెందిన విజయ్ కుమార్ చిరుధాన్యాలతో చిత్రాలను, బొమ్మలను తయారుచేస్తూ గుర్తింపు పొందారు. ఇటీవల మిల్లెట్స్‌తో తయారు చేసిన సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని అమరావతిలో అయనకు బహూకరించారు. వివిధ చోట్ల జరిగిన జీ- 20 సదస్సులో ఆయన తయారుచేసిన మిల్లెట్ చిత్రాలు ప్రదర్శించారు.

News September 20, 2024

విశాఖ: యార్లగడ్డ సహాయం కోరిన అమెరికా అధ్యక్ష అభ్యర్థి

image

మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను అమెరికా అధ్యక్ష ఎన్నికలలో సహాయ సహకారాలను అందించాలంటూ పిలుపు వచ్చింది. అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆమె ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న అమెరికా తొలి మహిళా స్పీకర్ నాన్సీ పెలోసీ కోరారు. ఈ మేరకు వారిద్దరూ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు ఈమెయిల్ సందేశాలు వంపినట్లు లక్ష్మీ ప్రసాద్ కార్యదర్శి ఎస్.బాబయ్య తెలిపారు.