News June 21, 2024
పక్కపక్కనే కూర్చున్న రఘురామ.. అయ్యన్న

అసెంబ్లీలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పక్కపక్కనే కూర్చున్నారు. అయ్యన్నకు స్పీకర్ పదవి ఖరారవ్వగా.. ఆ పదవికి రఘురామ పేరు కూడా వినబడేది. కాగా.. వైసీపీపై వీరిద్దరూ తమదైన శైలీలో ఆరోపణలు చేసేవారు. ఈరోజు అసెంబ్లీలో పక్కపక్కనే కూర్చున్న వీరిద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.
Similar News
News January 3, 2026
భీమవరం: గోదావరి క్రీడా ఉత్సవాలు ప్రారంభించిన కలెక్టర్

భీమవరంలో రెండురోజులపాటు జరిగే గోదావరి క్రీడా ఉత్సవాలను శనివారం కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. మండల, డివిజన్ స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన బృందాలు జిల్లా స్థాయిలో తలపడనున్నాయి. శని, ఆదివారాల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాట్మెంటన్, చెస్, టెన్ని కాయిట్, త్రో బాల్, క్యారమ్స్, షాట్ పుట్ వంటి 9 క్రీడాంశాలలో 235 బృందాలు, అథ్లెటిక్స్ 56 మందితో క్రీడా పోటీలను నిర్వహించనున్నారని తెలిపారు.
News January 2, 2026
ప.గో జిల్లాలో కిడ్నాప్ కలకలం

ఆకివీడు మండలంలోని తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. కాలనీకి చెందిన ఐదేళ్ల చిన్నారిపై ఆగంతకులు స్ప్రే చల్లి ఎత్తుకెళ్లినట్లు స్థానిక దివ్యాంగురాలు రుక్మిణి కుమారి తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ హనుమంతు నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
News January 2, 2026
ప.గో: ‘వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి’

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం-2026 సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తతతో ఉండాలన్నారు.


