News August 20, 2024

పక్కాగా ఓటరు జాబితా సవరణ: కలెక్టర్లు

image

ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా బీఎల్ఎలు నిర్వహించనున్న ఇంటింటి పరిశీలన ఆన్లైన్‌లో అప్డేట్ పకడ్బందీగా చేపట్టాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 1,2025 క్వాలిఫైయింగ్ ఆధారంగా చేపట్టనున్న ప్రత్యేక సవరణను దృష్టిలో ఉంచుకుని ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసేందుకు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.

Similar News

News October 22, 2025

నవాబు పేట్: కరెంట్ షాక్‌తో డ్రైవర్ మృతి

image

మండలంలోని యన్మన్‌గండ్లకు చెందిన జగదీశ్ (28) బుధవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఓ రైతు పొలంలోకి నర్సరీ చెట్లను తీసుకెళ్తుండగా కంచెలోని విద్యుత్ వైర్లను తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తూ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. మృతుడితో ఉన్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. జగదీశ్ బులెరో నడుపుతూ జీవనం సాగించేవాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

News October 22, 2025

కన్నుల పండువగా కురుమూర్తి స్వామి కళ్యాణ మహోత్సవం

image

శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో కమనీయంగా జరిగింది. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కురుమూర్తి స్వామి గిరులు “కురుమూర్తి వాసా గోవింద” నామ స్మరణతో మార్మోగాయి.

News October 22, 2025

రేపు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల కోఆర్డినేషన్ మీటింగ్

image

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు కోనేరు వద్ద ఉన్న కళ్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన ఏర్పాట్లు సహా తదితర ముఖ్య అంశాలపై సమీక్షించనున్నారు.