News April 15, 2025
పక్క పక్కనే షెడ్డులు ఉండటంతో ప్రాణనష్టం: ఎస్పీ

కైలాసపట్నం బాణసంచా కేంద్రంలో క్రాకర్స్ తయారీకి కెమికల్స్‌ను గ్రైండర్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కోటవురట్ల పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.. రెండవ నంబర్ షెడ్లలో పేలుడు జరిగి వ్యాపించిన మంటలు దగ్గరలో ఉన్న ఒకటో నంబర్ షెడ్‌కు వ్యాప్తి చెందినట్లు తెలిపారు. పక్క పక్కనే షెడ్లు ఉండటంవల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.
Similar News
News December 23, 2025
తూ.గో: 500 అడిగి.. ఆత్మహత్య చేసుకున్నాడు..!

అమలాపురం మెట్ల కాలనీలో దీపక్‌రాజ్(18) సోమవారం <<18637820>>ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే<<>>. చెడు వ్యసనాలకు బానిసైన అతడు ఆదివారం రాత్రి మద్యం కోసం తల్లిని రూ.500 అడిగాడు. ఆమె డబ్బులు పంపడంతో మద్యం తాగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. అనంతరం ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News December 23, 2025
అంతా హేమాహేమీలే.. భూపేశ్‌కు కత్తి మీద సామే!

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న ఆయనకు జిల్లాలోని హేమాహేమీలైన నేతలను మేనేజ్ చేయడం కత్తిమీద సాములాంటిదనే చెప్పాలి. ఎమ్మెల్యేలందర్నీ ఒకతాటిపై తీసుకొచ్చి.. లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీకి అధిక సీట్లను కైవసం చేసుకునేలా చేయడం ఆయనకు అతి పెద్ద టాస్క్. అలాగే అంతర్గత పార్టీ కుమ్ములాటలకు భూపేశ్ ఏ విధంగా పరిష్కారం చూపుతారనేది చూడాలి.
News December 23, 2025
పల్నాడు జిల్లాలోని లాడ్జిలో వ్యభిచారం గుట్టురట్టు!

నరసరావుపేట రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తుండగా ఎస్ఐ అరుణ తన సిబ్బందితో సోమవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ దాడులలో బాపట్ల జిల్లా సంతమాగులూరు చెందిన షేక్ గౌస్ బాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నరసరావుపేటలో వ్యభిచార గృహాలపై పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నా పదేపదే వ్యభిచారం నిర్వహిస్తూ మళ్లీమళ్లీ పట్టు బడుతున్నారు.


