News May 20, 2024
పగో: జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌కు రంగం సిద్ధం
పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ సాగుకు జిల్లా వ్యవసాయధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 2,13,339 ఎకరాల్లో సంబంధించి పత్తి, చెరకు, వరి, వెరుశనగ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ పంపిణీకి సిద్ధం చేసింది. అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు దుక్కులు దున్నుతున్నారు. 90 శాతం సబ్సిడీపై ఏజెన్సీ రైతులకు విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 8, 2024
జీలుగుమిల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం గ్రామ శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. జీలుగుమిల్లి మండలం అంకంపాలెంకి చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. అటుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 8, 2024
రవాణా శాఖ తనిఖీల్లో 832 కేసులు నమోదు
ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న రవాణా శాఖ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా 832 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. డిసెంబరు ఒకటవ తేదీ నుంచి ఈరోజు వరకు వివిధ రకాల వాహనాలపై పలు ఉల్లంఘనలకు గాను 832 కేసులు నమోదు చేసి 14 లక్షల 92 వేల రూపాయల అపరాధ రుసుము విధించామన్నారు. విద్యా సంస్థల బస్సులపై 23 కేసులు నమోదు చేశామన్నారు.
News December 8, 2024
దత్తత పిల్లలకు హాని జరిగితే చర్యలు: కలెక్టర్
దత్తత పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉంటుందని, దత్తత పిల్లలకు ఎటువంటి హాని జరిగిన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరించారు. శనివారం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పిల్లలు లేని తల్లిదండ్రులకు 7 నెలలు, 13 ఏళ్ల బాలికను కలెక్టర్ చేతుల మీదుగా దత్తత ఇచ్చారు. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని దత్తత తీసుకున్న వారికి సూచించారు.