News May 25, 2024
పచ్చటి పల్నాడు పల్లెల్లో రాజకీయ కార్చిచ్చు

పాడి పంటలతో కళకళలాడే పచ్చటి పల్నాడు జిల్లాలో రాజకీయ కార్చిచ్చుకు ఆహుతై పోతున్నాయి. కులమతాలకు అతీతంగా ఉండే ఆత్మీయులే ఎన్నికల సమయానికి బద్ధ శత్రువులుగా మారుతున్నారు. క్షణికావేశంలో జరిగే దాడులతో పురుషులు జైళ్ళపాలు అవుతుంటే.. మహిళలు వ్యవసాయ కూలీలవుతున్నారు. పల్నాడు ఫ్యాక్షన్‌లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉండగా.. ప్రస్తుతం అలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందని బిక్కుబిక్కుమంటున్నారు.
Similar News
News February 9, 2025
ఆ ఫోన్ నంబర్లు వస్తే ఫోన్ ఎత్తకండి: సీఐ రమేష్ బాబు

ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90, #09ను డయల్ చేయమంటే చేయొద్దని, అలా చేస్తే మీ సిమ్‌ని వారు యాక్టివేట్ చేసుకుని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. అట్లాగే +3, +5, +9, +2 సిరీస్‌తో వచ్చే ఫోన్ నంబర్లను అస్సలు లిఫ్ట్ చేయవద్దని సూచించారు. మిస్డ్ కాల్ వచ్చిందని ఆ నంబర్లకు ఫోన్ చేస్తే మూడు సెకన్లలో ఫోన్‌లో ఉన్న డేటాను హ్యాక్ చేస్తారని తెలిపారు.
News February 8, 2025
దక్షిణ భారతదేశంలోనే నాలుగు ధ్వజ స్తంభాలు కలిగిన దివ్య క్షేత్రం

తెనాలి షరాఫ్ బజారులోని శ్రీసువర్చల సమేత పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోనే 4 ధ్వజ స్తంభాలు కలిగిన ఏకైక ఆలయంగా విరజిల్లుతోంది. 5 ముఖాలతో స్వామి పూజలందుకుంటున్నారు. 1803లో భాగవతుల అన్నయ్య కుటుంబీకులు ఆలయ నిర్మాణం చేయగా నాటి నుంచి ఈక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లుతోంది. గర్భాలయంలో స్వామివారి 9 అవతార రూపాలు దర్శనమిస్తాయి. నేటి నుంచి వారం పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
News February 7, 2025
గుంటూరు: సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీ ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్(సప్లిమెంటరీ) థియరీ పరీక్షలను ఈనెల 18, 20, 22, 24, 27, మార్చి 1వ తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగ సిబ్బంది తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.