News February 5, 2025
పచ్చదనం పెంపొందేలా చర్యలు తీసుకోవాలి: నిర్మల్ కలెక్టర్

వనమహోత్సవంలో పచ్చదనం పెంపొందేలా లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం వన మహోత్సవం-2025 కార్యక్రమ కార్యచరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.
Similar News
News November 6, 2025
GWL: నిజాయితీ చాటుకున్న మహిళలు..!

గద్వాల పట్టణంలోని బాలికల పాఠశాల ముందు రోడ్డుపై పడి ఉన్న రూ.5 వేలను అటుగా వెళుతున్న ముగ్గురు మహిళలు గుర్తించారు. వాటిని తీసుకొని సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎస్సై బాలచంద్రుడును కలిసి తమకు రూ.5 వేలు దొరికాయని చెప్పి నగదు అందజేశారు. దీంతో ఎస్ఐ వారిని ప్రశంసించి అభినందించారు. డబ్బులు పోయిన వారు సంబంధిత సమాచారంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.
News November 6, 2025
బదిలీ ముసుగులో బలి తీసుకున్నారు: YCP ట్వీట్

మునగపాక మండలంలోని ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్న ఎంటీఎస్ ఉపాధ్యాయురాలిని కూటమి ప్రభుత్వం అల్లూరి జిల్లా పెదబయల మండలం మారుమూల గ్రామానికి బదిలీ చేసింది. అనారోగ్యం కారణంగా తనను బదిలీ చేయవద్దని అధికారులకు ఆమె విజ్ఞప్తి చేసుకున్నారు. వినకుండా కక్షపూరితంగా ఆమెను ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేయడం వల్లే పచ్చకామెర్లతో మృతి చెందినట్లు వైసీపీ ‘X’ లో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష ఎందుకని ప్రశ్నించింది.
News November 6, 2025
జాతీయస్థాయి జట్టుకు కెప్టెన్గా ఎంపికైన అమలాపురం విద్యార్థి

అమలాపురానికి చెందిన 8వ తరగతి విద్యార్థి గోసంగి సందీప్ అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన 69వ ఎస్జీఎఫ్ సెపక్ తక్రా రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్-19 విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన సందీప్ జాతీయస్థాయి జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయురాలు యెనుముల కనకదుర్గా విశ్వం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు గురువారం అభినందించారు.


