News March 19, 2024
పటాన్‌చెరులో నీట మునిగి బాలుడు మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని గౌతమ్‌నగర్ సమీపంలో మూత పడ్డ పరిశ్రమలో వున్న నీటి గుంతలో నీట మునిగి నిహద్ (10) అనే బాలుుడు మృతి చెందాడు. నలుగురు చిన్నారులు నీటి గుంత వద్దకు ఈతకు వెళ్లగా ఓ చిన్నారి గడ్డపై కూర్చున్నాడు. నీటి గుంతలోకి దిగిన మరో ఇద్దరు రాహుల్ (14), ఫైసల్ (5)లను స్థానికులు రక్షించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News November 17, 2024
UPDATE: జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
జహీరాబాద్‌లోని బైపాస్ వద్ద <<14625689>>రోడ్డు ప్రమాదం<<>>లో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదర్శనగర్ మలుపు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో NZB జిల్లా డిచ్పల్లికి చెందిన సురేశ్, కుత్బుల్లాపూర్‌కు చెందిన నరసింహారావు స్పాట్‌లో మృతి చెందారు. తీవ్రగాయాలైన శివకుమార్ సంగారెడ్డిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కర్ణాటకలోని గానుగపూర్‌కి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.
News November 17, 2024
MDK: గ్రూప్-3 పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి
ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేశారు. MDK జిల్లాలో 5,867 మంది అభ్యర్థులు, 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లాలో 13,401 మంది అభ్యర్థులు, 37 కేంద్రాల్లో గ్రూప్-3 పరీక్షకు హాజరుకానున్నారు. సంగారెడ్డి జిల్లాలో 15,123 మంది అభ్యర్థులు 49 పరీక్ష కేంద్రాల్లో హాజరు కానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.
News November 16, 2024
గజ్వేల్: ‘రేణుకది ఆత్మహత్య కాదు… హత్యే!’
కులాంతర వివాహం చేసుకున్న దళిత యువతి మైసని రేణుకది ఆత్మహత్య కాదని హత్య చేశారనే అనుమానం ఉందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామిలు ఆరోపించారు. రేణుక మరణ విషయం తెలుసుకున్న డీబీఎఫ్ బృందం బాధిత కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. రేణుక మృతిపై నిష్పాక్షిక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.