News February 4, 2025
పటాన్‌చెరు: అడవి పందిని తప్పించబోయి గన్‌మెన్ మృతి

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల MLA గన్‌మెన్ శ్రీనివాస్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలు.. మృతుడు శంకర్‌పల్లి మం. బుల్కాపూర్ వాసి. AR కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం పటాన్‌చెరు మం. వెలిమలలో బంధువుల ఇంటికి వెళ్లిన అతడు రిటర్న్ అయ్యాడు. బైక్‌కు <<15346562>>అడవి పంది అడ్డురావడంతో<<>> తప్పించే క్రమంలో కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో శ్రీనివాస్ మృతి చెందాడు. అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News March 14, 2026
గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: అదనపు కలెక్టర్ నగేష్

మెదక్ జిల్లాలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని అదనపు కలెక్టర్ నగేష్ స్పష్టం చేశారు. శుక్రవారం గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వినియోగదారులు సిలిండర్ బుక్ చేసిన 2-3 రోజుల్లోనే డెలివరీ చేసేలా చూడాలని ఆదేశించారు. కమర్షియల్ సిలిండర్ల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
News March 14, 2026
శివంపేట: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు

శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పంబ గ్రామానికి చెందిన కమ్మరి నాగరాజు భర్యతో కలిసి బైక్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్య అంజమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News March 13, 2026
మెదక్: టెన్త్ విద్యార్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు మెదక్ డీఈఓ విజయ తెలిపారు. బాలురు తమ హాల్ టికెట్ చూపిస్తే చాలు.. రూట్లతో సంబంధం లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలకు ఆధార్ కార్డు ద్వారా మహాలక్ష్మి పథకం కింద ఉచిత సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు భయం వీడి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.


