News February 4, 2025
పటాన్‌చెరు: అడవి పందిని తప్పించబోయి గన్‌మెన్ మృతి

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల MLA గన్‌మెన్ శ్రీనివాస్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలు.. మృతుడు శంకర్‌పల్లి మం. బుల్కాపూర్ వాసి. AR కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం పటాన్‌చెరు మం. వెలిమలలో బంధువుల ఇంటికి వెళ్లిన అతడు రిటర్న్ అయ్యాడు. బైక్‌కు <<15346562>>అడవి పంది అడ్డురావడంతో<<>> తప్పించే క్రమంలో కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో శ్రీనివాస్ మృతి చెందాడు. అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News December 8, 2025
విశాఖ-రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎప్పుడు పూర్తవుతుందంటే?

విశాఖ-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వే పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.16,482 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ వే పనులు 2026 DECకి పూర్తి కానున్నాయి. మొత్తం 597KM మార్గాన్ని 465KMకి తగ్గిస్తూ 6 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఇది పూర్తైతే AP,ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మధ్య రహదారి కనెక్టివిటీ మెరుగపడి ప్రయాణ సమయం 7 గంటలు తగ్గుతుంది. దీంతో టూరిజం,పారిశ్రామిక రవాణా, వ్యాపార అవకాశాలకు ఊతం లభించనుంది.
News December 8, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు

RBI <<18475069>>రెపో రేటును<<>> 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25% తగ్గించాయి. రెపో అనుసంధానిత రుణ రేటును PNB 8.35 నుంచి 8.10%కి, BOB 8.15 నుంచి 7.90%కి, BOI 8.35 నుంచి 8.10%కి సవరించాయి. హోం లోన్ రేట్లు 7.10%, కార్ లోన్ రేట్లు 7.45% నుంచి ప్రారంభమవుతాయని BOM తెలిపింది.
News December 8, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలపై శిక్షణ: డీఈవో

సంగారెడ్డి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలపై అధికారులకు మంగళవారం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మొదటి విడత శిక్షణకు హాజరుకాని అధికారులు తప్పనిసరిగా ఈ శిక్షణకు హాజరు కావాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


