News October 27, 2024

పటాన్‌చెరు: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట రూ.20.60 లక్షలు స్వాహా

image

పటాన్‌చెరు పరిధిలోని ఓ కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి సెప్టెంబర్ 23 ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు సంబంధించి ఓ మెసేజ్ వచ్చింది. దీంతో అతడు ఆన్‌లైన్లో పెట్టుబడి పెడుతూ వచ్చాడు. పలు దఫాలుగా మొత్తం రూ.20.60 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పెట్టిన పెట్టుబడి, వచ్చిన లాభం ఇవ్వాలని అడగ్గా సదరు వ్యక్తి నుంచి స్పందన లేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News November 22, 2025

మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎవరంటే!

image

మెదక్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శివన్నగారి ఆంజనేయులు గౌడ్‌ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణు గోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఆంజనేయులు గతంలో కూడా జిల్లా అధ్యక్షుడిగా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకే ఆయనను నియమించినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

మెదక్: పంచాయతీ ఎన్నికలపై జీవో జారీ.. అధికారుల చర్యలు

image

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.పంచాయతీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా కొత్త ప్రతిపాదనలను కమిషన్ సమర్పించింది. ఈ జీవో ఆధారంగా నేడు, రేపు వార్డుల రిజర్వేషన్లు, ఎంపీడీవో, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే దిశగా మెదక్ అధికారులు చర్యలు చేపట్టారు.