News February 13, 2025
పటాన్చెరు: ఉరివేసుకుని వృద్ధుడు ఆత్మహత్య

వేప చెట్టుకు ఉరివేసుకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటాన్చెరు పట్టణానికి చెందిన చిరుమణి కృష్ణ (68) గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. కడుపునొప్పి భరించలేక ఇంటి పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 18, 2025
రూల్స్ ప్రకారమే వైన్స్ టెండర్లు: డిప్యూటీ కమిషనర్

రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే వైన్స్ టెండర్లు వేస్తామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నల్గొండలో వైన్స్ టెండర్ల ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 154 వైన్ షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, నేడే తుది గడువు కావడంతో భారీ సంఖ్యలో టెండర్లు వస్తాయని ఆయన చెప్పారు.
News October 18, 2025
ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

AP: ఏజెన్సీల్లోని గురుకుల విద్యార్థులను విషజ్వరాలు వణికిస్తున్నాయి. కురుపాం స్కూళ్లో 150 మందికి పైగా జాండీస్ సోకగా ఇద్దరు మరణించడం తెలిసిందే. తాజాగా సాలూరు ఇతర ప్రాంతాల్లో 2900 మందికి వైద్య పరీక్షలు చేయగా 21మంది జ్వరాలున్నట్లు తేలింది. జాండీస్, మలేరియా ఉన్న వారికి చికిత్స అందిస్తున్నారు. స్కూళ్లలో పారిశుధ్య లోపం, ఏళ్లతరబడి మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయకపోవడమే వీటికి కారణమని పేర్కొంటున్నారు.
News October 18, 2025
పెద్దపల్లి: ఈనెల 22న జాబ్ మేళా

పెద్దపల్లి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 22న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ రూమ్ నం. 225లో జాబ్ మేళా ఉంటుందని ఉపాధి అధికారి ఎం. రాజశేఖర్ తెలిపారు. ఓ ప్రైవేటు ఇండస్ట్రీస్లో మిషన్ ఆపరేటర్, సూపర్వైజర్, క్లర్క్ వంటి 14 ఖాళీలు ఉన్నాయన్నారు. 18-35 ఏళ్ల అర్హులైన అభ్యర్థులు సర్టిఫికేట్లతో హాజరుకావాలన్నారు.