News June 28, 2024

పటాన్‌చెరు: కుక్కల దాడితో చిన్నారి మృతి

image

పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మహీదర వెంచర్లో కార్యకలాపాలు నిర్వహించడం కోసం విశాల్ (8) అనే చిన్న పిల్లవాడు వెళ్లగా కుక్కలు దాడి చేయడంతో చిన్నారి చనిపోయాడు. బిహార్ రాష్ట్రం నుంచి కూలి పనికి చిన్నారి కుటుంబం పటాన్ చెరువుకు వచ్చింది. మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 27, 2024

సంగారెడ్డి: మైనర్‌పై అత్యాచారం.. 20ఏళ్లు జైలు

image

మైనర్‌పై అత్యాచారం కేసులో నిందితుడు రజినీకాంత్‌కు 20 ఏళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి జయంతి తీర్పు వెల్లడించారని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. 2019లో చౌటకూరు మండలం ఉప్పరగూడెంకు చెందిన రజినీకాంత్ ఇంటికి వెళ్లి అత్యాచారం చేశాడని బాలిక తండ్రి పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు.

News December 27, 2024

సంగారెడ్డి: మైనర్ బాలికపై అత్యాచారం.. 20ఏళ్లు జైలు

image

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రజినీకాంత్‌కు 20 ఏళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి జయంతి తీర్పు వెల్లడించారని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. 2019లో చౌటకూరు మండలం ఉప్పరగూడెంకు చెందిన రజనీకాంత్ ఇంటికి వెళ్లి అత్యాచారం చేశాడని బాలిక తండ్రి పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు.

News December 27, 2024

సిద్దిపేట: స్పూర్తి ప్రధాత మన్మోహన్ సింగ్: మంత్రి పొన్నం

image

స్పూర్తి ప్రధాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. మన్మోహన్ సింగ్ వివేకం, సమగ్రతకు ఆదర్శమని, ఆయన దార్శనిక నాయకత్వం.. భారతదేశ పురోగతి పట్ల తిరుగులేని నిబద్ధత, దేశంపై చెరగని ముద్ర వేసిందన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు.