News June 28, 2024
పటాన్‌చెరు: కుక్కల దాడితో చిన్నారి మృతి
పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మహీదర వెంచర్లో కార్యకలాపాలు నిర్వహించడం కోసం విశాల్ (8) అనే చిన్న పిల్లవాడు వెళ్లగా కుక్కలు దాడి చేయడంతో చిన్నారి చనిపోయాడు. బిహార్ రాష్ట్రం నుంచి కూలి పనికి చిన్నారి కుటుంబం పటాన్ చెరువుకు వచ్చింది. మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 12, 2024
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలో జాగ్రత్త
ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి చంపేస్తోంది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. మెదక్ జిల్లా శివ్వంపేటలో 9.4డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, సంగారెడ్డి జిల్లా నల్లవల్లి 9.7, కంగ్టీ 9.8, కోహిర్‌లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్‌లో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News December 12, 2024
సంగారెడ్డి: ఉద్యోగుల వివరాలను సేకరించాలి: DEO
సంగారెడ్డి జిల్లాలోని విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షాలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగుల వివరాలను సేకరించి జిల్లా కార్యాలయానికి పంపాలని మండల విద్యాధికారులకు సూచించారు. కోరారు. సూచించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.
News December 12, 2024
చిదంబరం తెలంగాణ ప్రకటనకు కేసీఆరే కారణం: హరీశ్‌రావు
నాటి కేంద్ర మంత్రి చిదంబరం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ సత్యాన్ని ఏమార్చాలని కాంగ్రెస్ చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ గురించి సీఎం రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే నీ రెండు కళ్ళ సిద్ధాంతం గుర్తుకు వస్తుందని హరీశ్‌రావు తెలిపారు.