News February 9, 2025

పటాన్‌చెరు: గంజాయి నిందితులు మహారాష్ట్రలో అరెస్ట్

image

గంజాయి కేసు నిందితులను పోలీసులు మహారాష్ట్ర వెళ్లి పట్టుకున్నారు. పటాన్‌చెరు ఎక్సైజ్ పోలీసులు మహారాష్ట్ర వెళ్లి 220 కిలోల గంజాయి నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. 2024 సంవత్సరంలో 220 కిలోల గంజాయి నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు అమర్ సంజయ్ కావాల్, దిలీప్ ఆగడాలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పటాన్‌చెరు పీఎస్ SHO పరమేశ్వర్ గౌడ్ తెలిపారు.

Similar News

News October 30, 2025

ఇంట్లో పూజ గది ఏవైపున ఉండాలి?

image

ఇంట్లో పూజ గది ఈశాన్య దిశలో ఉండటం ఉత్తమమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. అది కుదరకపోతే.. తూర్పు/పడమర వైపు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ‘ప్రతి ఇంట్లో పూజా మందిరం తప్పనిసరిగా ఉండాలి. ఇది మనల్ని నియంత్రిస్తూ, భక్తిని, నమ్మకాన్ని పెంచుతుంది. అయితే.. ఆ గదిలో స్వర్గస్తుల ఫొటోలు ఉండకూడదు. నవగ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు కూడా శుభం కాదు. కులదేవతా ఫొటోలు మాత్రం ఉండవచ్చు’ అన్నారు. <<-se>>#Vasthu<<>>

News October 30, 2025

ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం: తుమ్మల

image

TG: తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా కల్పించారు. ఎకరాకు రూ.10వేల చొప్పున అందజేస్తామన్నారు. ఖమ్మంలో వరద ఉద్ధృతిని ఆయన పరిశీలించారు. 4.5లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. పశుసంపద, ఇళ్లు నష్టపోయిన వారినీ ఆదుకుంటామని చెప్పారు. రేపటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తారన్నారు.

News October 30, 2025

GDK నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సు

image

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని GDK డిపో ఆధ్వర్యంలో యాదగిరిగుట్టకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేశారు. NOV 4న ఉదయం 5 గంటలకు బయలుదేరి, అదే రోజు రాత్రి తిరిగి GDK చేరుకుంటుందని DM నాగభూషణం తెలిపారు. ఈ యాత్రలో యాదగిరిగుట్టతో పాటు స్వర్ణగిరి, కొమురవెల్లి మల్లన్నను దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. ఒక్కరికి ఛార్జీ ₹1100గా నిర్ణయించారు. రిజర్వేషన్ కోసం 7013504982 నంబర్‌ను సంప్రదించవచ్చు.