News July 28, 2024
పటాన్‌చెరు: ప్రేమ పెళ్లి.. 6 నెలలకే వివాహిత సూసైడ్
ప్రేమించి పెళ్లి చేసుకున్న 6నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్పూర్‌లో జరిగింది. APలోని గుంటూరుకు చెందిన హర్షిత, ఎడ్లపాడు చెందిన మహేశ్ పేరెంట్స్ సమక్షంలో ఫిబ్రవరి 23న పెళ్లి చేశారు. అమీన్పూర్ పరిధిలో అద్దె ఇంట్లో ఉంటుండగా మహేశ్‌కు ఉద్యోగం లేకపోవడంతో హర్షిత తండ్రి నెలకు రూ.30వేలు పంపాడు. ఇటీవల IT జాబ్ వచ్చినా మహేశ్ వెళ్లకపోగా ఆస్తిలో వాటా కోసం భార్యను వేధించగా మనస్తాపంతో సూసైడ్ చేసుకుంది.
Similar News
News December 13, 2024
మెదక్: ట్రాక్టర్ నడుస్తుండగానే ఊడిపోయాయి
రోడ్డుపై ట్రాక్టర్ నడుస్తుండగానే యంత్ర పరికరాలు విడిపోయి పడిపోయాయి. ప్రమాదం నుంచి డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ చౌరస్తాలో గురువారం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ ముందు చక్రాలు, ఇంజన్ భాగం ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తమై వాహనం నుంచి దూకడంతో ప్రమాదం తప్పింది.
News December 13, 2024
ఓపెన్ స్కూల్ దరఖాస్తులు ఈనెల 16 వరకు పెంపు
ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్మీడియట్ చదివేందుకు దరఖాస్తు గడపను ఈనెల 16 వరకు పెంచినట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. మీసేవా, ఆన్‌లైన్ కేంద్రాల్లో దరఖాస్తు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. అ అవకాశాన్ని గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 12, 2024
హీర్యా నాయక్ ఉగ్రవాదా.. లేక దోపిడీ దొంగా..?: హరీశ్ రావు
దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇంత కంటే దారుణం ఏముంటుందని ప్రశ్నించారు. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా అని నిలదీశారు.