News April 7, 2024

పటాన్‌చెరు: మోసపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని

image

ఆన్‌లైన్ ఉద్యోగం అంటూ వచ్చిన ప్రకటనకు స్పందించిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మోసపోయింది. అమీన్ పూర్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రీన్ మెడోస్ కాలనీలో నివాసం ఉంటున్న ఉద్యోగిని ఫోన్‌కు గతనెల 13న ఆన్‌లైన్ జాబ్ అంటూ లింకు వచ్చింది. టాస్కులు పూర్తి చేస్తే కమీషన్ ఇస్తామనడంతో రూ.2.92 లక్షలు వేసింది. తర్వాత అవతలి వ్యక్తులు స్పందించలేదు. దీంతో ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News April 20, 2025

మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుపై ఎస్పీకి ఫిర్యాదు

image

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేసిన వ్యాఖ్యలపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆదివారం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.

News April 20, 2025

ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి: మెదక్ కలెక్టర్

image

ధరణి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం కుల్చారం మండలం రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్టీవో మహిపాల్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు భూభారతి చట్టంపై పాటలతో అవగాహన కల్పించారు.

News April 20, 2025

సిద్దిపేట: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

image

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!