News June 23, 2024
పటాన్చెరు: రూ.1.05 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

టాస్క్‌లు పూర్తి చేస్తే కమిషన్ వస్తుందని ఆశ చూపి ఓ వ్యక్తి నుంచి రూ.1.05 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. పటాన్చెరు పోలీసులు తెలిపిన వివరాలు.. గోకుల్‌నగర్ చెందిన ఓ వ్యక్తికి జూన్ 14న టాస్క్‌లు పూర్తి చేస్తే కమిషన్ ఇస్తామంటూ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అతను వివరాలు నమోదు చేసి దఫదఫాలుగా రూ.1.05 లక్షలు జమ చేశాడు. అనంతరం అవతలి వ్యక్తి స్పందించలేదు. మోసపోయానని బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
Similar News
News October 18, 2025
దీపావళిని ఆనందంగా జరుపుకోవాలి: కలెక్టర్

ప్రజలంతా దీపావళి పండుగను సురక్షితంగా, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పర్యావరణహిత టపాసులు కాల్చడంతో వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే 101కు కాల్ చేయాలని సూచించారు.
News October 18, 2025
పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ రాహుల్

పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని కలెక్టర్ రాహుల్ సూచించారు. టేక్మాల్ మండలంలోని బర్దిపూర్‌లో పత్తి పంటను ఆయన పరిశీలించారు. జిల్లాలో 25,939 మంది రైతులు 34,903 ఎకరాల్లో పత్తి పండించారని, పాపన్నపేటలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పింజరకం(8110) రకానికి రూ. 8,110, పింజరకం(8060)కు రూ. 8,060 మద్దతు ధరలు ఉంది.
News October 18, 2025
మెదక్: ’25లోగా IFMIS పోర్టర్లో నమోదు చేయాలి’

మెదక్ జిల్లా అధికారులు, డీడీఓలు తమ పరిధిలోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల ఆధార్, పాన్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను ఈ నెల 25లోగా IFMIS పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఖజానా అధికారి అనిల్ కుమార్ మరాఠి ఆదేశించారు. వివరాలు నమోదు చేయని పక్షంలో అక్టోబర్-2025 మాసానికి సంబంధించిన జీతాలు/గౌరవ వేతనాలు అందవని ఆయన స్పష్టం చేశారు.