News June 23, 2024

పటాన్‌చెరు: రూ.1.05 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

image

టాస్క్‌లు పూర్తి చేస్తే కమిషన్ వస్తుందని ఆశ చూపి ఓ వ్యక్తి నుంచి రూ.1.05 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. పటాన్‌చెరు పోలీసులు తెలిపిన వివరాలు.. గోకుల్‌నగర్ చెందిన ఓ వ్యక్తికి జూన్ 14న టాస్క్‌లు పూర్తి చేస్తే కమిషన్ ఇస్తామంటూ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అతను వివరాలు నమోదు చేసి దఫదఫాలుగా రూ.1.05 లక్షలు జమ చేశాడు. అనంతరం అవతలి వ్యక్తి స్పందించలేదు. మోసపోయానని బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.

Similar News

News November 7, 2024

మెదక్: నెరవేరనున్న డీఎస్సీ-2008 అభ్యర్థుల 15 ఏళ్ల కల

image

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డీఎస్సీ-2008 సెలెక్టెడ్ అభ్యర్థుల కల నెరవేరబోతోంది. వీరిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సెప్టెంబర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 292 మంది సెలెక్టెడ్ లిస్టులో ఉన్నప్పటికీ 180 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వెరిఫికేషన్ ఫైనలైజేషన్ రేపటిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

News November 7, 2024

మెదక్: వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

image

మెదక్ జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలిలా.. కాగజ్ నగర్, మద్దూరుకు చెందిన రాములు(43), నర్సింహులు(32) రాయరావు చెరువు కల్వర్టులో పడి మృతి చెందగా.. వర్గల్‌లో విధులు ముగించుకుని వస్తున్న కిషన్ గౌడ్(35) చెట్టుకు ఢీకొని మృతి చెందాడు. తూప్రాన్‌కు చెందిన దేవయ్య(62) టిప్పర్ ఢీకొని మృతి చెందగా, శివ్వంపేటలో నిలిపిన లారీని ఢీకొని నర్సాపూర్‌కి చెందిన శ్రీనివాస్(42) మరణించాడు.

News November 7, 2024

MDK: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..

image

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.