News July 15, 2024
పటాన్చెరు MLA పార్టీ మార్పుపై.. జోరుగా చర్చలు

పటాన్చెరు MLA మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. మహిపాల్‌రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరికపై చర్చ జరపగా ఇందుకు పలువురు ఆసక్తి చూపనట్లు తెలిసింది. మరోవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఆయన్ని చేర్చుకోవద్దని అంటున్నారు. స్థానిక కాంగ్రెస్ నేత శ్రీనివాస్‌గౌడ్ వర్గం రహస్య సమావేశంతో ఆయన చేరికతో పార్టీ చీలిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Similar News
News September 17, 2025
మెదక్: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్ అమీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం PLAN INTERNATIONAL ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
News September 17, 2025
మెదక్: ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస రావు జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి, పట్టుదలతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సువిశాల భారతదేశంలో విలీనమై ప్రజాస్వామ్య దశలోకి ప్రవేశించిందని వివరించారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజల పాలన వైపు వచ్చిన ఈ పరివర్తన ప్రజాస్వామ్య శక్తికి ప్రతీక అన్నారు.
News September 17, 2025
జాతీయ స్థాయిలో మెదక్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు రెంజుకి షోటోకాన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ మాస్టర్ నగేశ్ తెలిపారు. ముంబైలో జాతీయస్థాయి కరాటే పోటీలు జరగగా మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థులు బ్లాక్ బెల్ట్ విభాగంలో అండర్ -13 స్వరూప్ సింగ్, అండర్-16 అబ్దుల్లా,
అండర్-17లో సూరజ్ గోల్డ్ మెడల్స్‌తో పాటు ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు.