News April 6, 2024
పటాన్ చెరు: కారు రన్నింగ్లో ఉండగా రివర్స్ గేర్.. యువకుడి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన పటాన్చెరు PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. శాంతినగర్కు చెందిన భగీరథ కుమార్(19), అతడి స్నేహితుడు నిఖిల్ కుమార్తో కలిసి శుక్రవారం ముత్తంగి పరిధిలో హోటల్కి వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు రన్నింగ్లో ఉండగా నిఖిల్ కుమార్ రివర్స్ గేర్ వేయడంతో చెట్టును ఢీకొంది. భగీరథకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News September 19, 2025
పాపన్నపేట: ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన: కలెక్టర్

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పాపన్నపేట పీహెచ్సీలో నిర్వహిస్తున్న స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పరిశీలించి, వైద్య సౌకర్యాలు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యవంతమైన కుటుంబమే దేశ సంక్షేమని అన్నారు.
News September 18, 2025
MDK: మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

మెదక్లోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 18, 19న దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఉమాదేవి తెలిపారు. కళాశాలలో బీఎస్సీ, బీఏ గ్రూప్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్టీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 7901097706ను సంప్రదించాలని సూచించారు.
News September 18, 2025
మెదక్: రాష్ట్రస్థాయి పోటీలకు జేఎంజే విద్యార్థులు

మెదక్ జిల్లా మనోహరాబాద్ జేఎంజే విద్యార్థినీలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ అనిత తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ మహేశ్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.