News March 30, 2024
పటాన్ చెరు: తల్లికి మాత్రలు తెచ్చేందుకు వెళ్లి విద్యార్థి మృతి

తల్లికి మాత్రలు తెచ్చేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన పటాన్ చెరులో జరిగింది. సీతారామపురం కాలనీలో ఉంటున్న సుదీప్ పట్నాయక్(15) పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి బాలుడి తల్లికి మాత్రలు తెచ్చేందుకు బైక్‌పై వెళ్లాడు. పెట్రోల్ బంకు వెళ్లి పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తుండగా ముందు వెళ్తున్న వాహనాన్ని బైక్ ఢీకొన్నాడు దీంతో బాలుడు మృతి చెందాడు.
Similar News
News February 12, 2026
మెదక్: ఓటు వేసిన 99 ఏళ్లు వృద్ధుడు

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణానికి చెందిన 99 ఏళ్ల మర్తి కిష్టయ్య తన ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం సెలవు ప్రకటించినా చాలామంది ఓటు వేయకుండా కాలక్షేపం చేస్తున్న తరుణంలో, ఈ వయసులో కూడా ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని గుర్తు చేశారు. కిష్టయ్య సంకల్పాన్ని చూసి స్థానికులు, అధికారులు అభినందించారు.
News February 12, 2026
మెదక్: నేడు సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా గురువారం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడాధికారి రమేశ్ తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో విజయం సాధించి, పేర్లు నమోదు చేసుకున్న క్రీడాకారులు నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News February 12, 2026
మెదక్ జిల్లాలో 81.09 % పోలింగ్

మెదక్ జిల్లాలో 81.09% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల వారిగా మెదక్‌లో 80.75 %, రామాయంపేటలో 84.84%, తుప్రాన్‌లో 81.30%, నర్సాపూర్‌లో 78.61% పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రామాయంపేటలో అత్యధికంగా 84.84% పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 86,109 మంది ఓటర్లు ఉండగా 69,823 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


