News January 28, 2025
పటిష్ట కార్యాచరణలతో అమలు చేయాలి: కలెక్టర్

రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి1న చేపట్టనున్న లక్ష గృహాల ప్రవేశాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో 6 వేల ఇళ్ల లబ్దిదారులకు తాళం చెవులు అందించే కార్యక్రమాన్ని పటిష్ట కార్యాచరణతో అమలు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరులో కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. మిగిలిన ఇళ్లు పనులు యుద్దప్రాదిపదికన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 18, 2025
అనకాపల్లి: సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలి

గంజాయి అక్రమ రవాణా వినియోగం, గుడ్ అండ్ బ్యాడ్ టచ్ మహిళలు బాలల హక్కులు, రోడ్డు భద్రత నియమాలు, సైబర్ నరాలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రజల్లో అవగాహన కల్పించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. మంగళవారం అనకాపల్లిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్‌తో సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా ద్వారా యువతను సరైన దిశలో నడిపించాలన్నారు.ఈ సమావేశంలో ఎస్.బీ డి.ఎస్.పి అప్పారావు పాల్గొన్నారు.
News February 18, 2025
ముస్లిం ఉద్యోగులకే పండుగా.. హిందువుల సంగతేంటి?: రాజాసింగ్

TG: రంజాన్ మాసంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు గంట ముందే కార్యాలయాల నుంచి వెళ్లిపోయేందుకు వెసులుబాటు కల్పించడంపై బీజేపీ MLA రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. బుజ్జగింపు రాజకీయాలు మరీ ఎక్కువయ్యాయని ట్వీట్ చేశారు. ‘ఉద్యోగులు త్వరగా ఇళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ హిందువుల పండుగలను విస్మరించింది. అందరికీ ఒకే రకమైన హక్కులు ఉండాలి. లేదంటే ఎవరికీ ఉండకూడదు’ అని పేర్కొన్నారు.
News February 18, 2025
వైఎస్ జగన్ దళిత ద్రోహి: ఎమ్మెల్యే బండారు శ్రావణి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ దళిత ద్రోహి అని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి విమర్శించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. దళితులపై దాడి కేసులో విజయవాడ సబ్ జైల్‌లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు’ అని చెప్పే నాయకుడు ఎస్సీల పైన దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారని మండిపడ్డారు.