News June 30, 2024
పటిష్ఠ ప్రణాళికతో పెన్షన్ల పంపిణీపై దృష్టిపెట్టండి: కలెక్టర్ సృజన
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద పెరిగిన పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందించేందుకు పటిష్ఠ ప్రణాళికతో, సమన్వయంతో కృషిచేయాలని జిల్లా కలెక్టర్ సృజన అధికారులను శనివారం ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 1వ తేదీ ఉదయం 6గంటలకు పెన్షన్ పంపిణీని ప్రారంభించి లబ్ధిదారులందరికీ పెన్షన్ మొత్తం అందించేందుకు కృషిచేయాలన్నారు.
Similar News
News October 16, 2024
కృష్ణా: ఇగ్నోలో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) ద్వారా ఆన్‌లైన్, ఓపెన్ & డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో పలు కోర్సులలో అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. ఇటీవల ఈ గడువు ముగియగా, ఈ నెల 31 వరకు గడువు పొడిగించినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. అడ్మిషన్ల వివరాలకు విజయవాడలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని లేదా https://ignouiop.samarth.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.
News October 16, 2024
కృష్ణా: ఇసుక తవ్వకాలకు మరికొన్ని రోజులు ఆగాల్సిందే
హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో జూన్ 1-అక్టోబర్ 15 మధ్య ఇసుక తవ్వకాల్ని ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో నేటి నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. కాగా ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంది. ఎగువ నుంచి కృష్ణా, గోదావరి నదులలో వరద తగ్గగానే దాదాపు 60 ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని సమాచారం.
News October 16, 2024
కృష్ణా: ఫార్మసీ విద్యార్థులకు అలర్ట్
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీ.ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్(Y17 నుంచి Y22 బ్యాచ్‌లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను డిసెంబర్ 2 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.