News November 11, 2024
పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శిగా భాధ్యతలు స్వీకరించిన కన్నబాబు

2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కె.కన్నబాబు పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శిగా సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న కన్నబాబుకు మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. అనంతరం కె.కన్నబాబు మంత్రి నారాయణతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
Similar News
News April 10, 2026
కృష్ణా: ఆలయ భూముల్లో అక్రమ మైనింగ్..!

కృష్ణాజిల్లాలో మరోసారి దేవాలయ భూములపై వివాదం రేకెత్తింది. మచిలీపట్నం బచ్చుపేట వేంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూముల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ పెడన(M) కొంకెపూడి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయానికి చెందిన సుమారు 4 ఎకరాల భూమిలో నల్ల మట్టిని భారీగా తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారన్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టి రూ.900కు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
News April 9, 2026
మచిలీపట్నం కూటమిలో అంతర్యుద్ధం..!

మచిలీపట్నం 6వ డివిజన్లో నిర్మాణంలో ఉన్న ఓ జనసైనికుడి ఇళ్లు కూల్చివేత కూటమిలో అంతర్యుద్ధానికి దారి తీసిందనే చర్చ నడుస్తోంది. అక్రమ కట్టడమంటూ ఇంటిని ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఇది కూటమిలోని TDP Vs జనసేనగా మారింది. మంత్రి కొల్లు రవీంద్రేమో దీన్ని అక్రమ కట్టడమని అధికారుల చర్యలను సమర్ధిస్తే.. జనసేన MP బాలశౌరి కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
News April 8, 2026
పాఠశాలలో కృష్ణా కలెక్టర్ తనిఖీలు

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బాపులపాడు మండలం మడిచర్లలోని పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులతో మమేకమై వారి చదువు అలవాట్లను తెలుసుకున్నారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు లేచి చదవాలన్నారు. పరీక్షల ముందు కాకుండా నిరంతరం అభ్యాసం చేయాలని సూచించారు. మార్కుల కోసం కాకుండా జ్ఞానం కోసం చదవాలని ప్రోత్సహించారు. వాలంటీర్లు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.


