News February 11, 2025
పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఇంద్ర గౌడ్ నామినేషన్

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి సిలివేరి ఇంద్ర గౌడ్ సోమవారం కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలని గజ్వేల్ ఎమ్మెల్యేగా, మెదక్ ఎంపీగా పోటీ చేశానని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
Similar News
News February 13, 2026
ఉపాధ్యాయుడికి 20 ఏళ్ల జైలు: అనకాపల్లి ఎస్పీ

బాలికను ప్రలోభ పెట్టి ఇద్దరు పిల్లల జన్మకు కారణమైన టీచర్‌పై నేరం రుజువు కావడంతో విశాఖపట్నం పోక్సో కోర్టు శిక్ష ఖరారు చేసిందని అనకాపల్లి SP తుహిన్ సిన్హా గురువారం తెలిపారు. చోడవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్‌గా పని చేసిన తిరుపతిరావు 2015లో బాలికను అపహరించారని ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారన్నారు. ఆధారాలు ఛార్జ్‌షీట్‌లో పేర్కొనడంతో 20 ఏళ్ల శిక్ష ఖరారు అయిందన్నారు.
News February 13, 2026
పూత, పిందె దశలో మామిడి పంటకు నీరు ఎలా ఇవ్వాలి?

మామిడి తోటలోని చెట్లు అన్నింటికీ పూ మొగ్గలు వచ్చినప్పుడు తోటకు తేలికగా నీరు పెట్టాలి. పిందెలు ఏర్పడ్డాక మామిడి చెట్లకు వీలును బట్టి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 తడుల నీటిని అందించాలి. దీని వల్ల పిందెలు రాలడం తగ్గి కాయలు పెద్దవిగా నాణ్యంగా పెరుగుతాయి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో అవసరానికి మించి చెట్లకు నీరు పెట్టడం వల్ల పిందెలు అధికంగా రాలిపోయే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News February 13, 2026
350 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

<


