News February 4, 2025

పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిన గవ్వల శ్రీకాంత్

image

జన్నారం మండలం కామన్‌పల్లికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్, పట్టభద్రుల ఎమ్మెల్సీ‌కి సోమవారం కరీంనగర్లో నామినేషన్ వేశారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని పట్టభద్రులు తనకు ఓటు వేసి గెలిపించాలన్నారు.

Similar News

News January 19, 2026

రాష్ట్రంలో 140 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో 140 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 31 ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ 79, అసోసియేట్ ప్రొఫెసర్ 44, ప్రొఫెసర్ 17 ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, PhDతో పాటు బోధన, రీసెర్చ్ అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://skltghu.ac.in/

News January 19, 2026

అనకాపల్లి: పీజీ ఆర్ఎస్‌కు 91.. రెవెన్యూ క్లినిక్‌కు 218 అర్జీలు

image

అనకాపల్లి కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహించారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొని అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్‌కు 91, రెవెన్యూ క్లినిక్‌కు 218 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News January 19, 2026

GO 16 మర్మం: సామాన్యుడికి శాపం.. బడా బాబులకు లాభం!

image

చెరువుల పరిరక్షణ ముసుగులో తెచ్చిన GO 16 నిబంధనలు అమలులోకి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో పెను మార్పులు ఖాయం. సెక్షన్ 4 కింద రికార్డుల్లో లేని నాలాలకూ 400% TDR ఇస్తుండటంతో రియల్టర్లు అధికారులతో కుమ్మక్కై పనికిరాని గుంటలను ‘నాలా’గా చూపిస్తూ వేల కోట్ల నిర్మాణ హక్కులు పొందే ప్రమాదం ఉంది. సెక్షన్ 6 ‘TDR బ్యాంకు’లో జమ అయ్యే వివాదాస్పద భూములపై పారదర్శకత లేకపోతే బ్రోకర్ల దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది.