News March 28, 2025

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఘన సత్కారం

image

శాసనమండలిలో పదవి కాలం పూర్తి చేసుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి గతంలో జీవన్ రెడ్డి గెలుపొందారు. ఈనెల 29న పదవీకాలం ముగుస్తుండడంతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జీవన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.

Similar News

News February 27, 2026

రంప: 12 మంది టీచర్స్‌ పదోన్నతిపై బదిలీ

image

పోలవరం జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న 12 మంది ఉపాధ్యాయులకు గురువారం పదోన్నతి కల్పించారు. రంపచోడవరంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య, DEO. మల్లేశ్వరావు టీచర్స్‌కు కౌన్సిలింగ్ నిర్వహించారు. తెలుగు పండిట్స్ నలుగురు, ఇంగ్లిష్ ముగ్గురు, హిందీ ఒకరు, ఫిజికల్ సైన్స్ నలుగురికి స్కూల్ అసిస్టెంట్స్‌గా పదోన్నతి కల్పించి బదిలీ చేశామన్నారు.

News February 27, 2026

బాలిక హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

ఉలిందకొండ PS పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి గురువారం తీర్పునిచ్చారు. కోర్టు రూ.7,000 జరిమానా విధించారు. చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో మరో నిందితుడుకి సాక్ష్యాల లోపంతో విముక్తి కల్పించారు.

News February 27, 2026

నష్టాల్లో మొదలైన మార్కెట్లు

image

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 270 పాయింట్లు కోల్పోయి 81,974 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు పతనమై 25,392 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ మినహా మిగతా రంగాల షేర్లన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.