News March 28, 2025
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఘన సత్కారం

శాసనమండలిలో పదవి కాలం పూర్తి చేసుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి గతంలో జీవన్ రెడ్డి గెలుపొందారు. ఈనెల 29న పదవీకాలం ముగుస్తుండడంతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జీవన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.
Similar News
News April 21, 2025
BE READY: రేపు మ.12 గంటలకు..

TG: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రేపు మ.12 గం.కు విడుదల కాబోతున్నాయి. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. దాదాపు 9.5లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. Way2News యాప్ ద్వారా ఎలాంటి యాడ్స్ లేకుండా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. మార్క్స్ లిస్టును ఈజీగా మీ సన్నిహితులకు షేర్ చేయొచ్చు.
*విద్యార్థులకు Way2News తరఫున BEST OF LUCK
News April 21, 2025
జంబ్లింగ్ విధానంలో ఏయూ డిగ్రీ పరీక్షలు: రిజిస్ట్రార్

ఏయూ పరిధిలో డిగ్రీ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు తెలిపారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో 180 కాలేజీల విద్యార్థులకు జంబ్లింగ్ విధానంలో 91 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండో సెమిస్టర్ విద్యార్థులకు ఉ.9 నుంచి 12 వరకు, నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
News April 21, 2025
నూజివీడు: విహారయాత్రకు వెళ్లి విషాదం నింపాడు

నూజివీడు మండలం బత్తుల వారి గూడెం గ్రామానికి చెందిన యువకుడు పావులూరి శ్యామ్ కుమార్ (20) ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి రేవు వద్ద విహారయాత్రకు వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. శ్యాం కుమార్ ఐటీఐ చదివి అప్రెంటిస్ పూర్తి చేసుకుని విజయవాడలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.