News May 10, 2024
పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లలో 6 తిరస్కరణ

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి ఈరోజు నామినేషన్లను పరిశీలించారు. ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. మొత్తం 69 మంది అభ్యర్థులు 117 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. వీరిలో ఆరు నామినేషన్లు తిరస్కరించామన్నారు. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని తెలిపారు.
Similar News
News October 24, 2025
పత్తిని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తేండి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

వర్షాల దృష్ట్యా పత్తిని రెండు మూడు రోజులు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు విజ్ఞప్తి చేశారు. మునుగోడులో డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్రెడ్డితో కలిసి శుక్రవారం ఆమె కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పత్తిలో తేమ 8-12 శాతం లోపు ఉండేలా చూడాలని, ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారికే కొనుగోలు ఉంటుందని తెలిపారు.
News October 24, 2025
ధాన్యం నాణ్యత, రైతులకు సౌకర్యం ప్రధానం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో మోసాలు జరగకుండా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధాన్యం నాణ్యత విషయంలో రాజీపడొద్దని, తరుగు విషయంలో రైతుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, తాత్కాలిక విశ్రాంతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 24, 2025
రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్

ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని రౌడీ షీటర్స్కు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్తో సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగేవారికి పోలీసుల సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.


