News May 3, 2024
పట్టభద్రుల పోలింగ్ శాతం ఈసారైనా పెరిగేనా..

ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేలా ఈసీ చర్యలు తీసుకుంటోంది. 2015లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల స్థానంలో 54.62 శాతం పోలింగ్ నమోదైతే 2021లో 76.35శాతానికి పెరిగింది. ఈసారి పట్టభద్రుల ఓటర్లు తగ్గటంతో పోలింగ్ శాతం ఏ మేరకు నమోదవుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
Similar News
News October 28, 2025
రాయపట్నంలో సబ్స్టేషన్కు Dy.CM భట్టి శంకుస్థాపన

మధిర మండలం రాయపట్నం గ్రామంలో 33/11 కేవీ నూతన విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, వోల్టేజీ సమస్యల పరిష్కారం, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సేవలు అందించడానికి ఈ ఉపకేంద్రం దోహదపడుతుందని తెలిపారు.
News October 28, 2025
డిప్లొమా దరఖాస్తు గడువు పొడిగింపు: ప్రిన్సిపల్ శంకర్

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నిషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సుల దరఖాస్తు గడువును నవంబర్ 27 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి.శంకర్ తెలిపారు. రెండేళ్ల కాల వ్యవధి గల ఈ కోర్సుల్లో 60 సీట్లు ఉన్నాయన్నారు. బైపీసీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, అభ్యర్థులు పూర్తి వివరాలకు https://tspmb.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 28, 2025
ఖమ్మం: రూ.2.6 లక్షలతో జర్మనీలో ఉద్యోగాలు

ఖమ్మం నగరంలోని టేకులపల్లి ITI క్యాంపస్లోని మోడల్ కెరీర్ సెంటర్లో ఈనెల 30న జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల కోసం ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరగనుందని జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. ITI ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్న, 19-30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని, ఎంపికైన వారికి నెలకు రూ.2.6 లక్షల వేతనం ఉంటుందన్నారు.


