News February 5, 2025
పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి బీఫామ్‌ను అందజేసిన కిషన్ రెడ్డి

కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కి బీఫామ్ ను బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News July 5, 2025
ఏలూరు ఈనెల 14న మెగా జాబ్ మేళా

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు ఎంపీ మహేశ్ కుమార్ తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14న ఏలూరు CR రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.10, ఇంటర్, ఐటీఐ, డిప్లమో బీటెక్, డిగ్రీ చేసిన వారు అర్హులన్నారు. రిజిస్టేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://naipunyam.ap.gov.in/user-registration
News July 5, 2025
నితిన్ ఖాతాలో మరో ప్లాప్?

నిన్న విడుదలైన ‘తమ్ముడు’ మూవీపై సినీ అభిమానులు, క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. వరుస ప్లాప్‌ల తర్వాత కథ విషయంలో నితిన్ ఏమాత్రం జాగ్రత్త తీసుకోలేదని, మరో ఫెయిల్యూర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడని అంటున్నారు. డైరెక్టర్ వేణు ఏం చెప్పాలనుకున్నారో ఎవరికీ అర్థం కాలేదని, నిర్మాత దిల్ రాజు ఈ మూవీని ఎలా అంగీకరించారో ఆశ్చర్యంగా ఉందని SMలో కామెంట్స్ చేస్తున్నారు. మీరూ ఈ సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.
News July 5, 2025
రాయపోల్: వడ్డేపల్లిలో మరోసారి చిరుతపులి కలకలం

రాయపోల్ మండలం వడ్డేపల్లిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఇంతకు ముందు చిరుతపులి ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు గుర్తించినా పట్టుకోవడంలో విఫలం అయ్యారని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామానికి చెందిన నవీన్ కుమార్ శుక్రవారం గేదెలను మేతకు తీసుకెళ్లాడు. సమీపంలో చిరుత కనిపించడంతో భయాందోళను గురయ్యాడు. సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించాడు.