News October 15, 2024
పట్టభద్రుల స్థానాన్ని ఐక్యంగా పోరాడి గెలిపించాలి: మంత్రి నిమ్మల
ఉమ్మడి తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్సీ స్థానాన్ని కూటమి నేతలు ఐక్యంగా పనిచేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. రాజమండ్రిలో పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు, సన్నాహ కార్యక్రమం లో భాగంగా ఎన్డీయే పార్టీ నేతల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సమావేశానికి టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Similar News
News November 8, 2024
కొవ్వూరు: యువతికి ప్రేమ పేరిట వంచన
కొవ్వూరుకు చెందిన యువతిని ప్రేమపేరిట మోసం చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వం తెలిపారు. తల్లి తెలిపిన వివరాలు.. యువతి అమ్మమ్మ ఊరు కడియపులంకకు వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సతీశ్ ప్రేమిస్తున్నాని గర్భవతిని చేసి కడుపు తీయించేశాడు. యువతి పెళ్లి చేసుకోవాలని నిలదీయగా ముఖం చాటేసినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, యువతిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
News November 8, 2024
CM, పవన్‌పై అసభ్య పోస్టులు.. ఒకరి అరెస్ట్
సీఎం చంద్రబాబు, DY CM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌పై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన యువకుడు అరెస్ట్ అయిన ఘటన ఉమ్మడి ప.గో జిల్లాలో వెలుగు చూసింది. గోపాలపురం SI సతీశ్ కుమార్ వివరాల ప్రకారం.. రంగంపేట మండలానికి చెందిన వీరాబత్తుల చంద్రశేఖర్ సోషల్ మీడియాలో సీఎం, పవన్, ఇతర మంత్రుల
ఫొటోలు మార్ఫింగ్ చేశాడు. పార్టీల మధ్య విభేదాలు, కార్యకర్తల మధ్య గొడవలు వచ్చేలా పోస్టులు పెట్టడంతో గురువారం అరెస్ట్ చేశారు.
News November 8, 2024
ప.గో: పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష
భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా SP అద్నాన్ నయీం అస్మితో కలిసి కలెక్టర్ నాగరాణి సమీక్షించారు. 2027లో గోదావరి పుష్కరాలు రానున్నాయని, దీనికి సంబంధించిన ఏర్పాట్లను ముందు నుంచే పక్కా ప్రణాళికతో ఉండాలని సూచించారు. జిల్లాలో ప్రధానంగా 33 పుష్కర ఘాట్లు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో చేయవలసిన ఏర్పాట్లపై సమీక్షించి నివేదికలను సమర్పించాలన్నారు.