News August 2, 2024
పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల నిలిపివేత

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు గోదావరి జలాల పంపిణీ నిలిపివేసినట్లు డీఈఈ పెద్దిరాజు గురువారం సాయంత్రం తెలిపారు. ఈ ఏడాది జూన్ 14 నుంచి ఇప్పటి వరకూ 10.3545 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేసినట్లు డీఈ తెలిపారు. కృష్ణా నది వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వలు అధికంగా ఉండడం వలన నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.
Similar News
News November 12, 2025
పాలకొల్లు: మంత్రి ట్వీట్.. దివ్యాంగుడికి త్రీవీలర్ మోటార్ సైకిల్ అందజేత

అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన దివ్యాంగుడు వెంకటేశ్వరరావు ఇటీవల పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి త్రీవీలర్ మోటార్ సైకిల్ కావాలని విజ్ఞప్తి చేశారు. ఆ విషయాన్ని మంత్రి ట్విట్టర్లో పెట్టగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పందించి తాను పంపిస్తానని రీట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న మంగళగిరిలో నిర్వహించిన ప్రజాదర్బార్లో దివ్యాంగుడికి వాహనాన్ని లోకేశ్ అందజేశారు.
News November 12, 2025
తణుకు: మలుపు తిరిగిన యువతి సజీవ దహనం కేసు

తణుకు(M) ముద్దాపురం గ్రామానికి ముళ్ళపూడి నాగ హరిత (19)సజీవ దహనం కేసు కీలక మలుపు తిరిగింది. 2022 NOV 12న జరిగిన ఈ ఘటనలో హరితను తలపై కొట్టి చంపి అనంతరం పెట్రోలు పోసి తగలబెట్టినట్లుగా తాజాగా ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని అప్పటి పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో తణుకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
News November 12, 2025
ఇరగవరం: గృహ హింస కేసులో భర్తకు ఏడాది జైలు శిక్ష

గృహ హింస, వరకట్న వేధింపుల కేసులో ఇరగవరం (M) రేలంగికి చెందిన బాదంపూడి శ్రీనివాస్కు సంవత్సర కాలంతో పాటు అదనంగా 3 నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ, రూ. 4500ల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. 2021 MARలో భార్య సునీత రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్పై అప్పటి SI సతీష్ కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ పూర్తి కాగా న్యాయమూర్తి పీవీ నాగ రంజిత్ కుమార్ తుది తీర్పును వెల్లడించారు.


