News July 26, 2024

పట్టిసీమ నుంచి 2,832 క్యూసెక్యుల నీరు విడుదల

image

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,832 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డీఈఈ పెద్దిరాజు గురువారం తెలిపారు. పట్టిసీమలో నీటిమట్టం 22.987 మీటర్లు నమోదు కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్లతో నీటిని వదిలినట్టు వివరించారు. కృష్ణా డెల్టా, ఉమ్మడి పశ్చిమ డెల్టాల సాగునీటి అవసరాల నేపథ్యంలో నీరు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 1, 2024

నరసాపురం: రాష్ట్రస్థాయి పోటీలకు 48 మంది ఎంపిక

image

నరసాపురం మండలం ఎల్బీచర్ల అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో సోమవారం జిల్లా స్థాయి అండర్-14, 17 రగ్బీ పోటీలకు బాల, బాలికల ఎంపికలు జరిగాయి. ప.గో. జిల్లా వ్యాప్తంగా 110 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా స్కూల్స్ గేమ్స్ సెక్రటరీ పీఎస్ఎన్ మల్లేశ్వరరావు తెలిపారు. మొత్తంగా 48 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని, వారు త్వరలో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.

News September 30, 2024

ప.గో: విషాదం.. కరెంట్‌ షాక్‌తో ITI విద్యార్థి మృతి

image

ప.గో జిల్లా ఆకివీడులో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో సాయినగర్‌కు చెందిన యారపాటి హేమంత్(19) మృతి చెందాడు. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గణపతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయినగర్‌లో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో హేమంత్‌కు విద్యుత్ షాక్ తగలడంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. హేమంత్ ITI చదువుతున్నాడు.

News September 30, 2024

విషాదం.. 18వ అంతస్తు నుంచి దూకి తల్లీకూతుళ్ల సూసైడ్

image

భీమవరంలో విషాదం నెలకొంది. 3ఏళ్ల కుమార్తెతో కలిసి 18వ అంతస్తు నుంచి దూకి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన మానస(30) భర్త, కూతురు కృషితో కలిసి HYDలోని నార్సింగి సమీపంలో నివాసం ఉంటోంది. భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆదివారం రాత్రి మానస కూతురితో కలిసి బిల్డింగ్‌ పైనుంచి దూకేసింది. అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.