News February 18, 2025
పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

పట్టిసీమ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం, తొక్కిసలాటలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఈ నెల 26వ తేదీన మహాశివ రాత్రి ఉత్సవాలు పట్టిసీమ వద్ద గోదావరి మధ్యన ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానంలో జరుగనున్నాయి. శివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి పాల్గొన్నారు.
Similar News
News September 18, 2025
గ్రౌండ్లోకి రాని పాక్ టీమ్.. అంపైర్లు ఏం చేశారో తెలుసా?

2006 AUG 20న ఇంగ్లండ్‌తో టెస్టులో <<17707677>>పాకిస్థాన్<<>> బాల్‌ట్యాంపరింగ్ చేసిందని అంపైర్లు గుర్తించి ఇంగ్లిష్ జట్టుకు 5రన్స్ పెనాల్టీ కింద ఇచ్చారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పాక్ ఆటగాళ్లు టీ బ్రేక్ తర్వాత మైదానంలోకి వచ్చేందుకు నిరాకరించారు. పాకిస్థాన్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చినా వాళ్లు గ్రౌండ్లోకి రాలేదు. దీంతో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చిన అంపైర్లు బెయిల్స్ తీసేసి ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు.
News September 18, 2025
‘తెలంగాణ చరిత్ర తెలియాలంటే సూర్యాపేటకు రండి’

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నారని బృందాకారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సాయుధ పోరాట వారోత్సవాల సెమినార్లో ఆమె మాట్లాడారు. సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చూపిస్తున్నారన్నారు. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షాలకు తెలంగాణ చరిత్ర తెలియాలంటే సూర్యాపేటకు వచ్చి చూడాలని ఆమె సవాల్ విసిరారు. చరిత్రను వక్రీకరించడం మానుకోవాలని హెచ్చరించారు.
News September 18, 2025
అంధుల పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక

ఖమ్మం జిల్లాలో అంధుల కోసం పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అంధుల స్కూల్ ఏర్పాటుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ, జడ్పీ సీఈఓ, విద్యాశాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.